ఆ హీరోయిన్‌తో డేటింగ్‌‌పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉన్ని ముకుందన్!

by Disha Web Desk 6 |
ఆ హీరోయిన్‌తో డేటింగ్‌‌పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉన్ని ముకుందన్!
X

దిశ, సినిమా: తమిళ హీరో ఉన్ని ముకుందన్ జనతా గ్యారేజ్, యశోద, భాగమతి వంటి తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘జై గణేష్’ మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 11న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఉన్ని ముకుందన్ హీరోయిన్ అనుశ్రీ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉన్ని ముకుందన్ డేటింగ్‌పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ అనుశ్రీతో నేను ఒక సినిమా మాత్రమే చేయబోతున్నాను. కానీ అంతా అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇండస్ట్రీలో నా పేరు తరచుగా ఇతర హీరోయిన్‌లతో ముడిపెడుతూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇవన్నీ చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. గతంలో కూడా ఇలాగే డేటింగ్‌లో ఉన్నట్లు పలువురు హీరోయిన్లతో లింక్ పెట్టారు. ఇప్పుడు వారంతా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం నాతో అనుశ్రీ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయంటే ఆమె తొందరలో పెళ్లి చేసుకోనుంది కావొచ్చు. నేనైతే ఎవ్వరితో డేటింగ్ చేయట్లేను కానీ ఆ రూమర్స్ ఎలా వస్తున్నాయి. అయితే అనుశ్రీపై ఇలాంటి పుకార్లు రావడం కొత్త కాబట్టి ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. కానీ నాకు ఇలాంటివి అలవాటు కాబట్టి పట్టించుకోను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story