- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజాసాబ్’ స్ట్రీమింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్.. అభిమానులకు పండగే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో తెరకెక్కిన ది ‘రాజాసాబ్’(Raja Saab) చిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో తెరకెక్కిన ది ‘రాజాసాబ్’(Raja Saab) చిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటించిన ఈ ఫాంటసీ, హారర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు తమన్(Thaman) మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.
అయితే సినిమా కంటెంట్ విషయంలో పొరపాట్లు గ్రహించిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి.. కొన్ని సీన్లు ఎడిట్ చేసి.. మరొకొన్ని సీన్లు జోడించి సినిమాను ఫ్రెష్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల మనసును దోచుకోలేకపోయింది. పర్యవసానంగా ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని బాక్సాఫీస్ వద్ద చవి చూసింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నది.
జియో హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ మేరకు ఆ సంస్థ అధికారికంగా డేట్ ప్రకటించింది. అయితే, థియేటర్లలో ‘ది రాజాసాబ్’ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేసినట్లు మేకర్స్ గతంలో వెల్లడించారు. ఇప్పుడు ఆ సీన్స్ అన్ని కూడా ఓటీటీ స్ట్రీమింగ్ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నట్లు జియో హాట్ స్టార్(Jio Hotstar) ట్వీట్ చేసింది. ‘ఊహించని పరిస్థితులు మరియు చివరి నిమిషంలో సాంకేతిక లోపాల కారణంగా, మేము పొడిగించిన కోతను జోడించాము.. హైప్ కారణంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.. జియోహాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






