- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్-అట్లీ సినిమాలో నటించడంపై స్పందించిన మృణాల్.. షాకింగ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్‌లో ‘సీతారామం' సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ‘సీతారామం' సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు, మ్యూజిక్ వీడియోలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో వచ్చిన ‘భీగి భీగి’ పాటలో మృణాల్ నటించింది. విశేషం ఏంటంటే, ఇందులో తన ఫేవరెట్ కో-స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆమె మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, ఈ పాట ప్రమోషన్ల సమయంలో మృణాల్ తనపై వస్తున్న ఒక ఆసక్తికరమైన రూమర్‌పై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) - మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee)కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (AA22)లో మృణాల్ ఠాకూర్ ఒక కీలక పాత్ర పోషిస్తోందని, ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొందని ప్రచారం జరుగుతోంది.
గత కొద్ది రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. తాజాగా, దీనిపై మృణాల్‌ను ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ‘‘అవునా? నిజంగానే నాకా ఛాన్స్ వచ్చిందా? అయితే ఖచ్చితంగా నా కోసం ప్రార్థించండి. ఒకవేళ అది నిజమైతే మాత్రం మనమందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేసుకుందాం’’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. మృణాల్ మాటలను బట్టి చూస్తుంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ సినిమాలో ఆమె నటించడం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది. అయితే, భవిష్యత్తులో బన్నీతో కలిసి పని చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని, అది తనకు చాలా సంతోషాన్నిస్తుందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో ‘దో దివానే షెహర్ మే’, ‘డెకాయిట్’ వంటిచిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.






