- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్లీ-అల్లు అర్జున్ సినిమాలో రష్మిక మందన్న.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా(పోస్ట్)
సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) సినిమా అల్లు అర్జున్(Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను పాన్ ఇండియా స్టార్స్‌గా నిలబెట్టాయి.

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) సినిమా అల్లు అర్జున్(Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను పాన్ ఇండియా స్టార్స్‌గా నిలబెట్టాయి. అప్పటి నుంచి వీరి గ్రాఫే చేంజ్ అయిపోయింది. వీరిద్దరూ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘AA22’ వర్కింగ్ టైటిత్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ నుంచి భారీ హైప్ క్రియేట్ అయింది.
ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్- రష్మిక జోడీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, అట్లీ ఈ కాంబోను మరోసారి తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారట. అంతే కాదు.. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో ఆమె సోలో సీన్లు షూట్ చేసినట్లు టాక్. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా, ప్రతినాయిక పాత్రలో కనిపించనుందట.
కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా ఆమె పాల్గొననున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా యాక్షన్ ట్రైనింగ్ తీసుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ఇది పూర్తిగా కొత్త ప్రయోగం కావడంతో, ఆమె కెరీర్‌లో ఇది కీలక మలుపుగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోపక్క అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇది '#AA23' వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభం కానుంది. ఇక అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.






