సినీ ప్రియులకు పండగే.. ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన నెట్‌ఫ్లిక్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-17 07:24:16  IST  )

సినీ ప్రియులకు పండగే.. ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన నెట్‌ఫ్లిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు కొత్త సినిమాల మోత మోగనుంది. నెట్‌ఫ్లిక్స్ పండగలో భాగంగా ఈ పాపులర్ ఓటీటీలో రాబోతున్న తెలుగు సినిమాలను వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ప్యారడైజ్ తో పాటు మరిన్ని కొత్త సినిమాలు రాబోతున్నాయి. అందులో ఇంకా ఏయే సినిమాలు ఉన్నాయో చూద్దాం..

1) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. థియేట్రికల్ రిలీజ్ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

2) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమా 'పెద్ది'. ఇది పాన్ ఇండియా సినిమా. మార్చి 27న విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ చేస్తారు.

3) న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. 'దసరా' విజయం తర్వాత హీరో - దర్శకుడి కలయికలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

4) విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'. షార్ట్ కట్‌లో 'ఏకే 47. థియేటర్లలో విడుదలైన తర్వాత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

5) దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'ఆకాశంలో ఒక తార'. ఇది కూడా పాన్ ఇండియా భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

6) విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘వీడీ-14’ వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. 'టాక్సీవాలా' తర్వాత వీళ్లిద్దరి కలయికలో సినిమా ఇది. దీని స్ట్రీమింగ్ రైట్స్ కూడా నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంది.

7) విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఫంకీ'. సితార నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. తెలుగులో విడుదల అయ్యే ఈ సినిమాను హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

8) ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. థియేట్రికల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

9) సంగీత్ శోభన్ కథానాయకుడిగా మానసా శర్మ దర్శకత్వంలో నిహారికా కొణిదెల నిర్మిస్తున్న 'రాకాస' సినిమాను సైతం స్ట్రీమింగ్ చేయనుంది నెట్‌ఫ్లిక్స్‌. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న '418' సినిమా కూడా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

10) కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమాను సైతం తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది.

11) శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా 'ఛాంపియన్'. థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Read More..

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

Next Story