- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pavan: హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు.. కాంగ్రెస్‌కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ తనను హైదరాబాద్ రావద్దంటే, రాహుల్ గాంధీకి సౌత్‌తో ఏం సంబంధం అని ప్రశ్నించాల్సి వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) ఎవరి జాగీరు కాదని.. తెలంగాణకు రానివ్వం అనే వాళ్లకు తన సమాధానం ఇదేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) అన్నారు. ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ భేదాలను తీసుకురావడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ లెక్కన చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతీనే, ఆయన మాతృభాష హిందీ కాదని.. కానీ ఆయనే ఈ దేశాన్ని ఏకం చేశారని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న సీఎం ఉత్తర, దక్షిణ భారతం అంటూ మాట్లాడితే ఈ దేశంలో ఎవరూ బ్రతకలేరని అన్నారు. సామాన్య ప్రజలు, రాజకీయాలపై అవగాహన లేని వారు ఇలా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కానీ సీఎంల హోదాలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోసారి దేశాన్ని విడదీసేలా ఉత్తర-దక్షిణ కోణంలో మాట్లాడొద్దని పవన్ సీఎం రేవంత్‌కు హితవు పలికారు.
ఓ జాతీయ పార్టీ.. ప్రాంతీయ విద్వేషాలా?
తెలంగాణ జనసేన (Janasena)పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందన్నారు. కానీ, తెలంగాణలో తనకు బలమైన కేడర్ ఉందని స్పష్టం చేశారు. 2007 నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా తెలంగాణ యువత తనను నమ్మి తనతోనే ఉన్నారని, తనకు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదన్నారు. కానీ తమ నాయకులు, కేడర్ ద్వారా తెలంగాణ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. తనను హైదరాబాద్ రావద్దంటూ బెదిరిస్తున్న కొన్ని శక్తులపై పవన్ విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ (BRS) కాకుండా, ఓ జాతీయ పార్టీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం తనకు వింతగా అనిపించిందని పవన్ అన్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమంటూ కొందరు అల్లరి మూకలను తనపైకి పంపుతున్నారని ఆరోపించారు. తన సొంత దేశంలో, తన మాతృభూమిలో తాను ఎక్కడికి వెళ్లాలో చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని అన్నారు. తాను ఎవరి అనుమతి అడగడం లేదని, హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని ఘాటుగా సమాధానమిచ్చారు.
బీఆర్ఎస్ నేతలు ఎన్నడూ అలా మాట్లాడలేదు..
కాంగ్రెస్ పార్టీ కనుక తనను మళ్లీ హైదరాబాద్ రావద్దని చెబితే.. అప్పుడు తాను రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఓ మాట చెప్పాల్సి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీకి అసలు దక్షిణ భారతదేశంతో ఏం సంబంధం ఉందన్నారు. ఆయన ఇక్కడి వాడు కాదు కదా అని తాను కూడా అనాల్సి వస్తుందంటూ కాంగ్రెస్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం రోజు సభ పెట్టుకుంటే అనుమతించలేదని, తెలంగాణలోకి రావద్దనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమేనని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు ఎన్నడూ అలా మాట్లాడలేదని.. కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. 13 నెలలుగా తనను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని.. మీ అయ్య జాగీరా అనొద్దా అంటూ పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.
నక్సలైట్‌గా మారాలనుకున్నా..
పవన్ కళ్యాణ్ తన టీనేజ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన టీనేజ్ చివరి రోజుల్లో (Late teens) సమాజంలో ఉన్న అసమానతలను చూసి చలించిపోయానని పవన్ అన్నారు. ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్ (Naxalite)గా మారిపోవాలని అనుకున్నానని తెలిపారు. సరిగ్గా అదే సమయంలో తన అన్న చిరంజీవి గమనించి సమాజానికి ఉపయోగపడే ఓ నిర్మాణాత్మకమైన మార్గం వైపు మళ్లించారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.






