మేడారంలో శ్వాశత పనులపై దృష్టి సారించాలి

by Taduka Kalyani |

మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో నిలిచిపోయిన శ్వాశత పనులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

మేడారంలో శ్వాశత పనులపై దృష్టి సారించాలి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో నిలిచిపోయిన శ్వాశత పనులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఈ సంవత్సరంలో జరిగిన మేడారం మహా జాతరను పురస్కరించుకొని 251 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టినప్పటికీ జాతర సమయం సమీపించడంతో 90 రోజులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మేడారంలో పూర్తి చేయాల్సిన పనులపై బుధవారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పి సుధీర్ రామనాథన్ కేకన్ తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్లకాలం నిలిచిపోయేలా చేసే పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయో పూర్తి వివరాలు తెలపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం నిర్వహించడం జరిగిందని, పనులు చేయాల్సిన ప్రతి శాఖ అధికారి పనులు పూర్తి కావడానికి చోరువ చూపాలని తెలిపారు. వనదేవతలే అడవిదేవతలని మేడారం పరిసర ప్రాంతాలను పచ్చటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు చెట్లను నాటి రక్షించుకోవాలని, చెట్లతోనే మానవుని జీవితం కొనసాగుతుందని అన్నారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువులు, కుంటలు తెగిపోకుండా మరమ్మతులు చేయాలని సూచించారు. వ్యవసాయ కాలం ప్రారంభం కానున్న దృశ రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సమావేశంలో ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో, డిఫ్ఓ వికాస్ మీనా,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా అధికారులు, పూజారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.

Next Story