తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హౌసింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట

by Ramesh Naini |

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాల నిర్వహణ, ప్రత్యక్ష నియామకాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హౌసింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాల నిర్వహణ, ప్రత్యక్ష నియామకాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018 ప్రకారం హౌసింగ్ కార్పొరేషన్‌లో స్థానిక కేడర్ల ఏర్పాటుకు సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌లోని వివిధ ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీ-జోనల్ కేడర్లుగా విభజించారు. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో చేపట్టే నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.

జిల్లా కేడర్‌లో 11 రకాల పోస్టులు:

జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, వర్క్ ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్, నాన్-టెక్నికల్), టెలిఫోన్ ఆపరేటర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, రోనియో ఆపరేటర్, బ్లూప్రింట్ ఆపరేటర్, అటెండర్, ఆఫీస్ వాచ్‌మన్, స్వీపర్ వంటి పోస్టులను జిల్లా కేడర్‌లో చేర్చారు.

జోనల్ కేడర్‌లో కీలక పోస్టులు:

అసిస్టెంట్ మేనేజర్, స్పెషల్ గ్రేడ్ స్టెనో, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పోస్టులను జోనల్ కేడర్‌గా గుర్తించారు.

మల్టీ-జోనల్ కేడర్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు

మేనేజర్ (ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్), మేనేజర్ (మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్/అసిస్టెంట్ ఇంజనీర్, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులను మల్టీ-జోనల్ కేడర్‌లో చేర్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ-జోనల్ కేడర్లకు ఆయా ప్రాంతాలే యూనిట్ ఆఫ్ అపాయింట్‌మెంట్‌గా పరిగణిస్తారు. ప్రత్యక్ష నియామకాల సమయంలో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2018లో పేర్కొన్న మేరకు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story