- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచలోహ విగ్రహం చోరీ కేసు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనవరి 22, 2026న పంచలోహ విగ్రహం చోరీకి గురైన విషయం తెలిసిందే. తాజాగా తంగళ్లపల్లి పోలీసులు ఈ విగ్రహం చోరీ కేసును ఛేదించారు. డీఎస్పీ నాగేంద్రచారి వివరాలను వెల్లడించారు.

దిశ, తంగళ్లపల్లి : జనవరి 22, 2026న పంచలోహ విగ్రహం చోరీకి గురైన విషయం తెలిసిందే. తాజాగా తంగళ్లపల్లి పోలీసులు ఈ విగ్రహం చోరీ కేసును ఛేదించారు. డీఎస్పీ నాగేంద్రచారి వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 22న చోరీకి గురైన పంచలోహ విగ్రహం కేసు పై న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడు చైతన్య మణికంఠను కస్టడిలోకి తీసుకొని విచారించారు పోలీసులు. నిందితుడు స్వచ్ఛందంగా నేరంగా అంగీకరించడంతో వేముల వాడ మండలం తేలుకుంట ఇంద్రనగర్ (అగ్రహారం) గ్రామంలోని అతని నివాసం వద్ద దాచి పెట్టిన పంచలోహ గరుడ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పంచలోహ గరుడ విగ్రహం సుమారు 15 నుంచి 20 కిలోల బరువు కలిగి ఉంటుంది. దాని విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఛేదించి, దొంగిలించబడిన పంచలోహ గరుడ విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్ఐ ఉపేంద్ర చారి, ఏఎస్ఐ జాన్, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, పోలీస్ కానిస్టేబుళ్లు సంపత్, శ్రావణ్ లను సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె.నాగేంద్ర చారి, సిరిసిల్ల రూరల్ సీఐ కె. నాగేశ్వర రావులు అభినందించారు. సమర్థవంతమైన దర్యాప్తు ఫలితంగానే కేసు ఛేదించబడిందని కొనియాడారు. ప్రజలు దేవాలయాలు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ నాగేంద్ర చారి కోరారు.






