- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు కిందపడి మేస్త్రి మృతి
ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి జారి కిందపడి తాపీ మేస్త్రి మృతి చెందిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, చైతన్యపురి : ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి జారి కిందపడి తాపీ మేస్త్రి మృతి చెందిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కే. సైదులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 9న కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ కాలనీలో గల న్యూ ఆర్‌బీఐ కాలనీలోని బిలకంటి గోపి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో శృంగేరి కాలనీలో నివాసం ఉండే తాపీ మేస్త్రి కుంచల వెంకటేశ్వర్లు (47) గత కొన్ని రోజులుగా మేస్త్రి పనులు చేస్తున్నాడు. మంగళవారం మొదటి అంతస్తులో పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడగా ముక్కు, నోటి నుంచి రక్తస్రావం జరిగింది. శరీరంలో అంతర్గత గాయాలు కావడంతో వెంటనే తనతో పాటు పనిచేసే మేస్త్రీలు, ఇంటి యజమాని గోపి 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ పరిశీలించగా, మృతుడు అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






