అర్ధరాత్రి ఒంటిగంట వరకు పలు జిల్లాల్లో వర్షాలు!

by velandi.Saikiran |

తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు వర్షాలు ప‌డ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

అర్ధరాత్రి ఒంటిగంట వరకు పలు జిల్లాల్లో వర్షాలు!
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్థరాత్రి ఒంటి గంట వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి, వరంగల్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కీలక ప్రకటన చేసింది. పైన పేర్కొన్న జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీరుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.

Next Story