ఆస్ప‌త్రిలో పాలైన భార‌త క్రికెట‌ర్‌..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

భార‌త క్రికెట‌ర్ హ‌ర్ధిక్ పాండ్యా వెళ్లిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఆస్ప‌త్రిలో పాలైన భార‌త క్రికెట‌ర్‌..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో విఫలమైన హార్దిక్ పాండ్యా, బెంగళూరులో మెరిశారు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ డయాగ్నొస్టిక్స్ సెంటర్ కు ఖరీదైన ఫెరారీ కారులో వెళ్లారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాను చూసిన అభిమానులు... ఆసుపత్రి వ‌ద్ద హడావిడి చేశారు. RCB.. RCB అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అయితే ఆ ఆసుపత్రికి దగ్గర క్రౌడ్ ఎక్కువగా అయిన‌ నేపథ్యంలో రంగంలోకి పోలీసులు కూడా దిగారు.

అక్కడ ఉన్న పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రిలో ఉన్న పాండ్యా, టెస్టులు చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యాకు అసలు ఏమైంది ? ఎందుకు ఆసుపత్రికి వచ్చాడు ? మహికా ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతోందా ? అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. కాగా వ‌చ్చే సీజ‌న్ లో ఆర్సీబీ త‌ర‌ఫున పాండ్యా ఆడ‌బోతున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇటీవ‌ల దినేష్ కార్తిక్ తో కూడా పాండ్యా సీక్రెట్ గా మీట్ అయ్యారు.

Next Story