ప్ర‌ధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు..ఆయ‌న రియ‌ల్ హీరో అంటూ !

by velandi.Saikiran |

ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.

ప్ర‌ధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు..ఆయ‌న రియ‌ల్ హీరో అంటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్: భారతదేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన రియల్ హీరో అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ... గొప్ప లీడర్ అంటూ అభివర్ణించారు. ఇండియాకు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచిన తన మిత్రుడు నరేంద్ర మోడీకి అభినందనలు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మోడీ గొప్ప, బలమైన, వివేకవంతుడైన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు ప్ర‌ధాని మోడీ సాధించాలని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు.

Next Story