బీసీసీఐకి భువ‌నేశ్వ‌ర్ వార్నింగ్..నేను ఎవ‌రినీ బ‌తిలాడ‌ను !

by velandi.Saikiran |

బీసీసీఐకి భువ‌నేశ్వ‌ర్ వార్నింగ్ ఇచ్చారు..నేను ఎవ‌రినీ బ‌తిలాడ‌ను అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

బీసీసీఐకి భువ‌నేశ్వ‌ర్ వార్నింగ్..నేను ఎవ‌రినీ బ‌తిలాడ‌ను !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ కు భారత జట్టులో అవకాశం రాలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవల గాయం బారిన పడ్డ హర్షిత్ రాణా, పెద్దగా బౌలింగ్ అనుభవం లేని ప్రసిద్ కృష్ణ లాంటి వాళ్లకు అవకాశం ఇస్తున్న బీసీసీఐ, ఐపీఎల్ లో రాణించిన సీనియర్ ఆటగాడు భువనేశ్వర్ కు మాత్రం ఛాన్సులు ఇవ్వడం లేదు. ఒకప్పుడు భారత జట్టులో అగ్రశ్రేణి బౌలర్ గా ఉన్న భువనేశ్వర్, ఇప్పుడు అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన భారత జట్టులో తన పేరు లేకపోవడంపై భువనేశ్వర్ స్పందించారు.

ఇండియా కోసం ఆడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న.. కానీ ఈ విషయాన్ని బయట పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్న.. సెలక్టర్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని వివరించారు. భారత జట్టులోకి ఎంపిక చేయడం అనేది సెలెక్టర్ల బాధ్యత.. జట్టుకు తాను అవసరమనుకుంటే కచ్చితంగా తీసుకునేవాళ్ళని పెద్ద మనసుతో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు అడ‌టం చాలా గొప్ప విషయమని.. గతంలో దాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు తనను సెలెక్ట్ చేస్తే ఆడతా.. లేకపోతే ఐపీఎల్ ఆడుకుంటానని వ్యాఖ్యానించారు.

Next Story