- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: కాగితపు నోట్లు రద్దు వదంతులను ఖండించిన ఆర్‌బీఐ
ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని కాగితపు నోట్లు చట్టబద్ధంగానే కొనసాగుతాయని, వాటిని ఉపసంహరించుకునే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జూన్ 30 నాటికి కాగితపు కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఖండించాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని కాగితపు నోట్లు చట్టబద్ధంగానే కొనసాగుతాయని, వాటిని ఉపసంహరించుకునే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. ఈ వదంతులకు మద్దతుగా ప్రచారం అవుతున్న వీడియోల్లో తప్పుడు సమాచారం ఉందని, కొన్నింటిలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాన్ని డిజిటల్(ఏఐ వాయిస్)గా అనుకరించినట్లు నకిలీ వీడియోను కూడా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మకుండా, ఆర్‌బీఐ లేదా ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని సూచించారు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే లాభనష్టాలపై ప్రస్తుతం ప్రాథమిక దశలో అధ్యయనం జరుగుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.






