ఉప్పల్‌ లో మహిళ పై వేధింపులు

by Nallavelli.Anjaneyulu |

ఉప్పల్‌ కు చెందిన ఓ వివాహిత మహిళ పై వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది.

ఉప్పల్‌ లో మహిళ పై వేధింపులు
X

దిశ‌, ఉప్ప‌ల్ : ఉప్పల్‌ కు చెందిన ఓ వివాహిత మహిళ పై వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. ఫిర్యాదు దారు గతంలో నారపల్లి ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అక్కడే పని చేసే ఇండ్ల ప్రసాద్ అనే వ్యక్తి తనను తరచూ మాట్లాడాలని ఒత్తిడి చేయడంతో పాటు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వెంటపడుతూ వేధించాడని తెలిపింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉద్యోగం మానేసింది. అయినప్పటికీ అతను ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా వేధింపులు కొనసాగించాడని, తన భర్తకు కూడా మెసేజ్‌లు పంపుతున్నాడని తన అనుమతి లేకుండా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌ లలో పోస్ట్ చేస్తున్నాడని, వాటిని తొలగించమని కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో తనను నిరంతరం మానసికంగా వేధిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story