- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత యువ సంచలనం అనాహత్ సింగ్ పై ప్రధాని ప్రశంసలు
2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యంగ్ సెన్సేషన్ అనాహత్ సింగ్ చారిత్రక ఘనత సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: 2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యంగ్ సెన్సేషన్ అనాహత్ సింగ్ చారిత్రక ఘనత సాధించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) సాధించి, వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ స్క్వాష్ క్రీడాకారిణిగా అనాహత్ రికార్డు సృష్టించారు.
అనాహత్ సింగ్ సాధించిన ఈ అద్భుత విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. "వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2026లో చారిత్రాత్మక ఘనత సాధించిన అనాహత్ సింగ్‌ను చూసి దేశం ఎంతో గర్విస్తోంది. ఈ టోర్నీలో స్వర్ణ పతకం గెలుచుకుని, ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా నిలవడం అభినందనీయం. ఆమె సాధించిన ఈ విజయం యువతలో స్క్వాష్ క్రీడ పట్ల ఆసక్తిని, ఆదరణను మరింతగా పెంచుతుంది" అని ప్రధాని కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన అనాహత్ సింగ్‌పై దేశవ్యాప్తంగా క్రీడాకారులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






