ఐదుగురు ఎస్ఐల బదిలీలు

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సబ్ ఇన్ స్పెక్ట‌ర్ల‌ను బదిలీ చేస్తూ జోగులాంబ జోన్ -7 డిప్యూటీ ఇన్ స్పెక్ట‌ర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్ఎస్ చౌహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదుగురు ఎస్ఐల బదిలీలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సబ్ ఇన్ స్పెక్ట‌ర్ల‌ను బదిలీ చేస్తూ జోగులాంబ జోన్ -7 డిప్యూటీ ఇన్ స్పెక్ట‌ర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్ఎస్ చౌహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూత్పూర్ ఎస్సైగా పని చేస్తున్న పి చంద్రశేఖర్ మహబూబ్ నగర్ వి ఆర్ కు బదిలీ కాగా.. దేవరకద్ర ఎస్ఐగా పని చేస్తున్న బి. నాగన్న భూత్పూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు జడ్చర్ల డీటీసీ కి బదిలీ కాగా.. మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ రెడ్డి దేవరకద్ర కు బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ వీఆర్ లో ఉన్న కె.మురళి అడ్డాకుల ఎస్సైగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story