ఇప్పటికైనా తగ్గించండి: కూనంనేని డిమాండ్

by Vemula.Srinu Prasad |

కేంద్ర ప్రభుత్వం యుద్దం సాకుతో పెట్రోల్, డీజిల్,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు చేపట్టిన ఆందోళనలు జయప్రదం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు...

ఇప్పటికైనా తగ్గించండి: కూనంనేని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం యుద్దం సాకుతో పెట్రోల్, డీజిల్,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు చేపట్టిన ఆందోళనలు జయప్రదం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.సామాన్యుడు బంగారం కొనవద్దని, అధిక ఖర్చులు పెట్టవదని పేద ప్రజలకు చెబుతున్న దేశ ప్రధాని ధనికవర్గాల మీద కంట్రోల్ లేదని, కార్పొరేట్ సంస్థలకు సంపద పన్ను వేయవచ్చు కదా అని ప్రశ్నించారు. దేశంలో కష్టం చేసింది ప్రజలని, ఆదాయం మాత్రం కార్పోరేట్ వర్గాలకు చేరుతుందని, కార్పొరేట్ సంస్థల మీద నియంత్రణ లేదని వారు తెలిపారు. ఎప్ప్పుడు లేనంతగా ఆర్థిక మాంధ్యం ఉన్నదని, ఆర్థిక సంక్షోభంతో దేశం అల్లాడిపోతోందన్నారు. ఎన్నడూ లేని విధంగా రూపాయి డాలర్ మారకపు విలపు 96 రూపాయలకు పడిపోవడమంటే చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న కాలం గుర్తు చేస్తున్నదని, ఆనాడు బంగారం తాకట్టు పెట్టిన పరిస్థితులు ఇప్ప్పుడు దేశానికి వస్తున్నదని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్లాక్‌మార్కెట్ లేకుండా అక్రమ నిల్వలపై దాడులు చేసి ధరలను అదుపు చేయాలన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని సాంబశివరావు తెలిపారు.



Next Story