- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెర్ఫ్ పారా మీటర్లను మెరుగు పరచాలి : కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
సెర్ఫ్ పారా మీటర్లను మెరుగు పరచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి: సెర్ఫ్ పారా మీటర్లను మెరుగు పరచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి స్త్రీనిధి సమీక్షా కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు.. నిరర్థక ఆస్తుల (NPA) రికవరీపై ఎస్ఎన్ఆర్సి (SNRC) కమిటీ సభ్యులు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, జెడ్ఎంఎస్ ఓబిలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని సీసీలందరికీ సూచించారు. గ్రూప్ యూనిట్లను గుర్తించాలని, ఇప్పటికే జిల్లాకు షీ మార్ట్ మంజూరు చేయబడిందని తెలిపారు. (SERP) పారామీటర్లను మెరుగుపరచాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కిషోర బాలికల సంఘాలలో ప్రతిభ కలిగిన అమ్మాయిలను ఎంపిక చేసి ఫోటో గ్రఫి, కంప్యూటర్ శిక్షణ కోసం హైదరాబాద్ పంపించేలా చూడాలని డీఆర్డీఏ వెంకట్ రాములు కు సూచించారు.
జిల్లాకు హ్యాండ్ లూమ్ టెక్స్ టైల్ కూడా రాబోతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు మంజూరైన షీ మార్ట్ లో ఏ ఏ ఉత్పత్తులు పెట్టాలో జాబితా తయారు చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో వారానికి ఒక రోజు (శుక్రవారం) మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన/ విక్రయం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా స్కూల్ యూనిఫాం కోసం వచ్చిన బల్క్ క్లాత్ ను వెంటనే పంపించి, స్టిచ్చింగ్ బాధ్యత ను ఏపీఎంలు, సీసీ లు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. మండలానికి ఒక మాస్టర్ ట్రైనర్ ఉంటారని, యూనిఫాం కొలతల హెచ్చు తగ్గులను ఆయన సరి చేస్తారని, పాఠశాలల హెచ్ఎం, ఉపాధ్యాయుల తో సమన్వయం చేసుకుని యూనిఫాం లను పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, మున్సిపల్ కమిషనర్ శంకర్, డీపిఎంలు, ఏపీఎం లు, సీసీ లు, ఓబీ లు పాల్గొన్నారు






