ఖమ్మం, మల్కాజ్‌గిరి ఘటనలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |

రేవంత్‌రెడ్డి పాలనలో మహిళలపై నిత్యం అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు...

ఖమ్మం, మల్కాజ్‌గిరి ఘటనలపై  కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి పాలనలో మహిళలపై నిత్యం అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసేసి హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన దారుణమని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రత సంగతేంటని ప్రశ్నించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు మల్కాజ్‌గిరిలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన దారుణమని పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే నిందితుడు తన భార్యను కాల్చిచంపుతానంటూ బహిరంగంగా బెదిరించాడని గుర్తుచేశారు. అప్పుడే పోలీసులు స్పందించి చర్యలు తీసుకునే ఉంటే ఓ మహిళ నిండు ప్రాణం బలయ్యేదని కాదని పేర్కొన్నారు. మహిళల నేరాలను అరికట్టటంలో రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయనడానికి ఖమ్మం, మల్కాజ్‌గిరి ఘటనలే సాక్ష్యమని పేర్కొన్నారు.

మురళీధర్ దేశ్ పాండేకు నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్ట్ నాయకుడు మురళీధర్ దేశ్ పాండే మరణం తీవ్రంగా కలిచి వేసిందని కవిత అన్నారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, కళాకారుల లోకానికి తీరని లోటన్నారు. కొత్తపేట్‌లోని మురళీధర్ దేశ్ పాండే నివాసంలో ఆయన పార్థీవ దేహానికి కవిత నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తోటి ఉద్యమకారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story