- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఏసీపీ వసుంధర యాదవ్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏన్కూరు మండలంలోని నూకాలంపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, ఏన్కూరు : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏన్కూరు మండలంలోని నూకాలంపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు రోడ్డు భద్రత పై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఐపీఎస్ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అతివేగాన్ని నివారించడం వంటి అంశాల పై ప్రజలకు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం ఏసీపీ వసుంధర యాదవ్ ఏన్కూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సీసీటీఎన్‌ఎస్ (CCTNS) పనితీరును సమీక్షించారు. రికార్డులు, ఆన్‌లైన్ ఎంట్రీలు, పెండింగ్ పనులను పరిశీలించి స్టేషన్ రైటర్లు, సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేశారు. రికార్డుల నవీకరణ, డేటా ఖచ్చితత్వం, పెండింగ్ పనుల సత్వర పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఖమ్మం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎం బంజారా సీఐ ముత్తులింగం, ఏన్కూరు ఎస్సై సంధ్య తదితరులు పాల్గొన్నారు.






