భద్రాచలం ప్రయాణంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సాయిబాబా ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆనందంగా ప్రారంభమైన ఓ కుటుంబ భద్రాచలం యాత్ర ఒక్కసారిగా విషాదంగా మారింది.

భద్రాచలం ప్రయాణంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
X

దిశ, పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సాయిబాబా ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆనందంగా ప్రారంభమైన ఓ కుటుంబ భద్రాచలం యాత్ర ఒక్కసారిగా విషాదంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అనురాగ్ కుటుంబం ఇటీవల విశాఖపట్నం నుంచి మధిరలోని బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం చిన్నారి ఆయిద్యను తీసుకుని తల్లి హాద్యతో పాటు అమ్మమ్మ పద్మావతి, తాతయ్య కృష్ణకేశవ్ కలిసి భద్రాచలం దర్శనానికి బయలుదేరారు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవడంతో చిన్నారి ఆయిద్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆనందంగా సాగాల్సిన పుణ్యక్షేత్ర యాత్ర ఇలా శోకయాత్రగా మారిపోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాల పై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో మధిర, పాల్వంచ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. చిన్నారి మృతి వార్తతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

Next Story