- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తో బాలుడు మృతి..
విద్యుత్ షాక్ కు గురై బాలుడు మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

దిశ,దుబ్బాక : విద్యుత్ షాక్ కు గురై బాలుడు మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం. నారాయణరావుపేట మండలం మల్యాలకు చెందిన శంకర్ గౌడ్ కు భార్య నిర్మల, కుమారుడు చరణ్ తేజ (11), కుమార్తె ప్రవీణ ఉన్నారు. చరణ్ తేజ తన అక్కతో కలిసి సెలవులను గడిపేందుకు దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి మంగళవారం సాయంత్రం వచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అక్కతో కలిసి బాలుడు రహదారి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్తింగ్ తీగ బాలుడి కుడి చేతికి తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో వెంటనే కిందపడి అపస్మారక స్థితికి చేరిన బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని మేనమామ భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు.






