- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని నందమూరి, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని నందమూరి, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. హనుమాన్ దీక్షలో భాగంగా కొండగట్టు చేరుకున్న వారు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన షాలిని, నార్నే మల్లీశ్వరికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం.. ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు దేశ ప్రజల సుఖశాంతులు, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తుల రద్దీ మధ్య అంజన్నను దర్శించుకున్న షాలిని, నార్నే మల్లీశ్వరి ఆలయానికి వచ్చిన భక్తుల దృష్టిని ఆకర్షించారు. హనుమాన్ దీక్షలో భాగంగా కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్, మాల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ పాల్గొన్నారు.






