- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమస్య ఎదురైతే నా దృష్టికి తీసుకురండి: డీసీపీ అంకిత్
గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య తీరితే అంతటా అది క్రమక్రమంగా ప్రభావం చూపిస్తుందని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు.

దిశ, నర్సంపేట: గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య తీరితే అంతటా అది క్రమక్రమంగా ప్రభావం చూపిస్తుందని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు అనూహ్యంగా డీసీపీ హాజరయ్యారు. గ్రామ స్థాయిలో ఏర్పడే శాంతి భద్రతల సమస్యలు, సైబర్ ఫ్రాడ్ తదితర సమస్యలు తన దృష్టికి సైతం తీసుకురావచ్చని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. సివిలియన్ కి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతీ పోలీస్ కర్తవ్యం అన్నారు. ఎస్సై అరుణ్, సీఐ శ్రీనివాస్ దైనందిన జీవితంలో ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన నియమాలను, నిబంధనలను వివరించారు. అనంతరం ఇటుకాలపల్లి గ్రామ సభలో సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలన్న ఆశయంతో ఉన్నట్లు తెలిపారు. తమకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మార్వో రవి చంద్రారెడ్డి సహా ఇతర శాఖల అధికారులతో గ్రామస్తుల సమక్షంలో చర్చించారు. ప్రజల సూచనలు, సలహాలు తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూస్తానని గ్రామ సర్పంచ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






