పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్‌నగర్‌ పోక్సో అత్యాచార కేసు గురించి ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తమన్ రాజరాజేశ్వరి విచారణ జరిపి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ జానకి తెలిపారు.

పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసు కు సంబంధించి, బాలిక పై లైంగిక దాడి చేసిన నిందితుడు గుర్రాల బాలయ్య పై విచారణ పూర్తి అయింది. మహబూబ్‌నగర్‌ పోక్సో అత్యాచార కేసుల విచారణ, ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తమన్ రాజరాజేశ్వరి విచారణ జరిపి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆమె హెచ్చరించారు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించిన రూరల్ సిఐ గాంధీ నాయక్, ఎ.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ జి.విజయ్ కుమార్, స్పెషల్ పీపీ ఎం.జాన్, కోర్టు లైజన్ అధికారులు బాలకృష్ణ (ఏఎస్ఐ), కృష్ణయ్య (పీసీ), శంకర్ (పీసీ), రహీమ్ (పీసీ), అలాగే సీడీఓ అశోక్ రెడ్డి (పీసీ) లు సమన్వయంతో పనిచేసి, కేసు కన్విక్షన్ సాధించడంలో కీలక పాత్ర పోషించి, సమర్థవంతంగా పనిచేసిన అందరిని ఎస్పీ జానకి అభినందించారు.

Next Story