- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తుంది : డీజీపీ స్వాతి లక్రా
మీరు వాహనంపై బయటకు వెళ్లినప్పుడు తిరిగి వచ్చే వరకు మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారని గమనంలో ఉంచుకొని వాహనాలను నడపాలని ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ డిజీపీ స్వాతి లక్రా హితవు పలికారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మీరు వాహనంపై బయటకు వెళ్లినప్పుడు తిరిగి వచ్చే వరకు మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారని గమనంలో ఉంచుకొని వాహనాలను నడపాలని ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ డిజీపీ స్వాతి లక్రా హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బాలానగర్ గ్రామంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో 'అరైవ్ అలైవ్' లోని భాగంగా నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి తో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలు, తీవ్ర గాయాలు, అంగవైకల్యం దాదాపు 90 శాతం వరకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం వలన తగ్గించవచ్చని ఆమె అన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్ధాలను ఆమె వివరిస్తూ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక, మానసిక ఇబ్బందుల గురించి ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అలాగే డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వంటి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమయ్యే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు, విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలతో పాటు, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలరని ఆమె వివరించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డిజీపీ స్వాతి లక్రా చేతుల మీదుగా 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్ భాను మిశ్రా, జడ్చర్ల రూరల్ సీఐ మహేష్, కళాశాల ప్రిన్సిపాల్ సౌమ్య, వైద్య అధికారి డాక్టర్ నేహా, సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, బాలానగర్ ఎస్ఐ నరేందర్ పాల్గొన్నారు.






