అగ్ర కులస్తులు పదోన్నతుల కోసమే లంబాడీ ఉద్యోగుల పై ఏసీబీ దాడులు

by Batti.Sumithra |

లంబాడీ ఉద్యోగస్తుల పై టార్గెట్టెడ్ గా ఏసీబీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ అన్నారు.

అగ్ర కులస్తులు పదోన్నతుల కోసమే లంబాడీ ఉద్యోగుల పై ఏసీబీ దాడులు
X

దిశ, హిమాయత్ నగర్ : లంబాడీ ఉద్యోగస్తుల పై టార్గెట్టెడ్ గా ఏసీబీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ అన్నారు. ఈ మేరకు బుధవారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ సమాజానికి చెందిన ఉన్నతాధికారుల పై జరుగుతున్న వరుస ఏసీబీ దాడుల నేపథ్యంలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి లంబాడీ సామాజిక వర్గం పై వివిధ శాఖలకు సంబంధించిన బంజారా ఉద్యోగుస్తుల పై దాడులు ఎక్కువ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఏసీబీ దాడులు విచారణల పేరుతో సాగుతున్న పరిణామాలు లంబాడీ సమాజం తీవ్రంగా ఆందోళన గురవుతుందన్నారు. తాజాగా ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ పై జరిగిన ఏసీబీ దాడుల తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. అదే విధంగా అనేక శాఖల్లో అగ్రకులాల ఉద్యోగస్తుల పై ఎందుకు దాడులు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. కులవివక్షతో లంబాడీ కులస్థుల పై వరుస ఏసీబీ దాడుల పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఎందుకంటే అగ్రకులస్తుల ప్రమోషన్ల కోసమని లంబాడీ ఉద్యోగుస్తుల పై ఏసీబీ దాడులు చేయిస్తున్నారని కుర్ర మోతిలాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు పతి నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్, మహిళా నాయకురాలు స్వప్న రాథోడ్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story