- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కోరుట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, కోరుట్ల రూరల్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కోరుట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలంలోని సంగెం గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ (47)అనే వ్యక్తి మెట్ పెల్లిలోని ఆరోరా జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని టీఎస్ 16ఈఎఫ్ 5382నెంబర్ గల ద్విచక్ర వాహనంపై కోరుట్ల వైపు వడ్తున్నాడు. కోరుట్ల నుంచి మెట్ పెల్లి వైపు వెళ్తున్న టీఎస్ 05 ఎఫ్ఏ 0866నెంబర్ గల కారు కోరుట్ల శివారులోని పెద్దగుండు ప్రాంతంలో హెచ్.పి పెట్రోల్ పంపు సమీపంలో ఢీ కొట్టడంతో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతిని భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






