- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు నెలల్లో పెండింగ్ పరిహార ప్యాకేజీ చెల్లింపులు పూర్తి చేయాలి : కమిషనర్ శివకుమార్ నాయుడు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి, రాబోయే 2 నెలల్లోగా పెండింగ్ పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నింటినీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్&ఆర్) కమిషనర్ కె .శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి, రాబోయే 2 నెలల్లోగా పెండింగ్ పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నింటినీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్&ఆర్) కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదండాపూర్, కోయిల్‌సాగర్, కల్వకుర్తి(ఎంజీకెఎల్ఐఎస్), రాజీవ్ భీమా ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రగతి, ప్రతిపాదిత లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అనుసంధాన టన్నెల్ భూసేకరణపై కమిషనర్ ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉదండాపూర్, వల్లూర్ గ్రామాలతో పాటు రేగడిపట్టి, చిన్నగుట్ట, తుమ్మలకుంట, శ్యామగడ్డ, ఒంటిగుడిసె, పోలేపల్లి అనే 6 తండాలు ముంపునకు గురవుతున్నట్లు రెవెన్యూ అధికారులు నివేదించారు. 1,890 మంది నిర్వాసితుల ఖాతాల్లో నిధులు జమ చేశామని, మిగిలిన అర్హులైన వారికి అవార్డు పాస్ చేసి త్వరలో పరిహారం అందచేస్తామని ఆర్ &ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు.
ఉదండాపూర్ ముంపు బాధితుల కోసం కేటాయించిన 280 ఎకరాల పునరావాసం లే అవుట్ పనులు పురోగతి లో ఉన్నాయని తెలిపారు. ఎక్కడైతే పునరావాస కేంద్రం సరిహద్దు వివాదాలు ఉన్నచో వాటి పరిష్కారానికి జడ్చర్ల తహసిల్దార్, ల్యాండ్ సర్వే ఏడీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల కోసం ప్రభుత్వం వారం రోజుల్లో 3 కోట్ల రూపాయలు విడుదల చేయనుందని విద్యుత్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మిషన్ భగీరథ పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, ఆర్ అండ్ బీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, పునరావాస కేంద్రంలో గుడు ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సంబంధించి భూ సేకరణ సమస్యల గురించి కమిషనర్ శివకుమార్ నాయుడు అడిగి, వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డిఫ్యూటీ కలెక్టర్ రాంరెడ్డిని కమిషనర్ ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంబంధించి అవసరమైన 105 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 90.5 ఎకరాలు సేకరించగా, మిగిలిన 13.5 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు అధికారులు తెలిపారు. రాజీవ్ భీమా ప్రాజెక్టు సంబంధించి కేవలం ఒక ఎకరం లోపు భూమి మాత్రమే సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ జెఎల్ బి హరిప్రియ, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, ఆర్డీఓ నవీన్, భూ సర్వే రికార్డుల శాఖ ఏడి అశోక్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్, మిషన్ భగీరథ, జడ్చర్ల తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






