- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రావు బహదూర్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘జస్ట్ ఎ టీజర్’ అంటూ పోస్ట్
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’.

దిశ, సినిమా: వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. ‘జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్’ పతాకంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాకు వెంకటేశ్ మహా దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే సైకలాజికల్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో సత్యదేవ్ విభిన్న లుక్స్‌తో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన సత్య లుక్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఈ క్రమంలోనే ‘రావు బహదూర్’ మూవీ రిలీజ్ డేట్ ఇస్తూ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రావు బహదూర్ పిచ్చిని చూడటానికి సిద్ధంగా ఉండండి.. 'జస్ట్ ఎ టీజర్' జూన్ 12న విడుదల కానుంది.. సినిమా 3 జూలై 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్.






