ఓటు చోరీ తర్వాత సీటు చోరీ.. బీజేపీపై వేముల వీరేశం సంచలన ఆరోపణలు

by Ramesh Naini |

బీజేపీ ఓటు చోరీతో పాటు సీటు చోరి కూడా చేస్తోందని, మీనాక్షి న‌ట‌రాజ‌న్ నామినేష‌న్‌ను తిర‌స్కరించ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ అని ప్రభుత్వ విప్, వేముల వీరేశం ఆరోపించారు.

ఓటు చోరీ తర్వాత సీటు చోరీ.. బీజేపీపై వేముల వీరేశం సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఓటు చోరీతో పాటు సీటు చోరి కూడా చేస్తోందని, మీనాక్షి న‌ట‌రాజ‌న్ నామినేష‌న్‌ను తిర‌స్కరించ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ అని ప్రభుత్వ విప్, వేముల వీరేశం ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు మీనాక్షి న‌ట‌రాజ‌న్ నామినేష‌న్‌ను తిర‌స్కరించేలా చేశారని, గాడ్సే రంగు పూసుకున్న వాళ్ల రంగును మీనాక్షి నాట‌రాజ‌న్ బ‌య‌ట‌పెడుతుంద‌నే నామినేష‌న్ ను తిర‌స్కరించారన్నారు. బుధవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేముల వీరేశం మాట్లాడుతూ.. ఎవ‌రో కోర్టులో పిటిష‌న్ వేశార‌ని దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ లేకుండా నామినేష‌న్‌ను తిర‌స్కరించ‌డం ప్రజాస్వామ్యంలో చీక‌టి రోజు అని, ఇంత కాలం సీబీఐ, ఈడీ లాంటి సంస్థలే బీజేపీ కంట్రోల్‌లో ఉన్నాయ‌ని భావించాం, కానీ, ఇప్పుడు ఈసీ కూడా బీజేపీ కంట్రోల్ లో ప‌నిచేస్తుంద‌నే అనుమానాలున్నాయి.. ఈసీ ఆ పార్టీకి జేబు సంస్థగా మారిందని వేముల వీరేశం ఆరోపించారు.

మ‌హిళ‌లు రాజ‌కీయంగా ముందుకు రాకుండా బీజేపీ దుర్మార్గమైన కుట్ర చేసిందని, దేశంలోని మ‌హిళ‌లంతా మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు అండ‌గా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ‌త‌క‌నివ్వద‌ల్చుకోలేదని, మ‌హిళ‌ల‌పైన ప్రేమ ఉన్నట్లు బీజేపీ న‌టిస్తోందని వేము వీరేశం మండిపడ్డారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అడ్డుకున్నార‌ని గ‌గ్గోలు పెడుతున్న బీజేపీ ఒక మ‌హిళ నామినేష‌న్ ను తిర‌స్కరించేలా చేసిందని, ఆ పార్టీకి మ‌హిళ‌ల ప‌ట్ల ఎంత గౌర‌వం ఉందో అర్థమౌతోందని ఆయన విమర్శించారు. నెహ్రు రికార్డు ను బ్రేక్ చేశాన‌ని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ ఈ దేశ విలువ‌ల‌ను, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయ‌డంలో రికార్డు సృష్టిస్తున్నారని, బీజేపీ ఏక్ నాథ్ షిండేల‌ను కోరుకుంటోంది, నిబ‌ద్దత క‌ల్గిన నాయ‌కుల‌ను అణిచివేస్తోందని వేముల వీరేశం ఆరోపించారు. బీజేపీతో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఉంద‌ని ముందే రాహుల్ గాంధీ హెచ్చరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేశార‌న‌డం త‌ప్పు అని, కుట్రలు చేయ‌డం బీజేపీ, బీఆర్ఎస్ లకు వెన్నతో పెట్టిన విద్య అని వేముల వీరేశం మండిపడ్డారు.

Next Story