- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడ, నల్గొండలకు భారీ నిధుల వరద.. రూ.169 కోట్లకు పైగా కేటాయింపులు
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ (వీటీఏడీఏ)కు రూ.86.25కోట్లకు పరిపాలన అనుమతికి మంజూరు ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ (వీటీఏడీఏ)కు రూ.86.25కోట్లకు పరిపాలన అనుమతికి మంజూరు ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2026-27బడ్జెట్ కేటాయింపులో భాగంగా వీటీఏడీఏకు అదనపు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను ఆయా అభివృద్ధి పనులకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నల్గొండ కార్పొరేషన్ కు రూ.83 కోట్లు
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ ఐడీసీ) ద్వారా రూ.83 కోట్ల రుణం ఇవ్వడానికి మున్సిపల్ శాఖ పరిపాలన అనుమతి మంజూరు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థన మేరకు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






