- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ పెంచిన లారెన్స్.. మరో రోజు వేచి చూడాల్సిందే!
తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ప్రకటన వాయిదా..
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 11 (గురువారం) ఉదయం 9:30 గంటలకు లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయాల్సి ఉంది. కానీ భారతీరాజా మృతి నేపథ్యంలో దీనిని జూన్ 12 (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు వాయిదా వేశారు.
లారెన్స్ భావోద్వేగ పోస్ట్..
‘చిత్ర పరిశ్రమ అంతా భారతీరాజా సర్ మరణంతో తీవ్ర విషాదంలో ఉంది. నేను నా సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధతో ఉన్నాను. ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో నా జీవితంలోని ఒక ముఖ్యమైన నిర్ణయ ప్రకటనను వాయిదా వేస్తున్నాను’ అని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
పొలిటికల్ ఎంట్రీపై కొనసాగుతున్న సస్పెన్స్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్.. రెండు స్థానాల నుంచి గెలుపొంది, అందులో ‘తిరుచ్చి’ సీటుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ తిరుచ్చి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అభ్యర్థిగా రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం లారెన్స్ అధికారికంగా టీవీకే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటిస్తారా? లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారింది. తాజా వాయిదాతో అభిమానులు మరో రోజు పాటు ఉత్కంఠగా వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.






