- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరడిగుంట సర్పంచ్ ఒగ్గుసాయిపై మహిళా దాడికి యత్నం...
తన భూమిని అక్రమించుకున్నాడన్న ఆరోపణతో ఓ మహిళ నేరడిగుంట సర్పంచ్‌పై కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించిన ఘటన జోగిపేటలోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో కలకలం రేపింది.

దిశ, అందోల్: తన భూమిని అక్రమించుకున్నాడన్న ఆరోపణతో ఓ మహిళ నేరడిగుంట సర్పంచ్‌పై కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించిన ఘటన జోగిపేటలోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో కలకలం రేపింది. బుధవారం జోగిపేట తహశీల్దార్ ఆవరణలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే నేరడిగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ కూడా హజరు కావడంతో, అదే గ్రామానికి చెందిన సుశీల అనే మహిళ అక్కడికి వచ్చి తన భూమిని ఎప్పుడు పట్టా చేయిస్తావంటూ బండ బూతులు తిడుతూ సర్పంచ్ సాయికిరణ్ కాలర్ పట్టుకుని ఈడ్చుకేళ్లింది. ఈ ఘటనను చిత్రికరిస్తున్న సర్పంచ్ అనుచరుడిని కూడా ఆ మహిళ కాలర్ పట్టుకుని పిడిగుద్దులు గుద్దుతూ సర్పంచ్ వద్దకు లాక్కొచ్చింది. ఈ గొడవను ఆపేందుకు వచ్చిన ఆమె భర్త శ్రీశైలంను కూడా ఆమె కాలుతో తన్ని పక్కకు నెట్టేసింది. ఈ గొడవ అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌ల ముందే జరుగుతున్న ఎవ్వరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అలానే చూస్తూ నిలబడి ఉండిపోవడం కనిపించింది. తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మహిళ సర్పంచ్‌పై దాడికి యత్నించడంపై అక్కడున్న వారంతా నివ్వేరపోయారు. ఇదిలావుండగా తనపై దౌర్జన్యానికి పాల్పడి చంపుతానని బెదిరించిన సుశీల ఆమె భర్త శ్రీశైలంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ తెలిపారు.






