- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 17న మెగా జాబ్ మేళా : ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్
ములుగు మండలంలోని గ్రామంలో గల ఎమ్మార్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 17న మెగా జాబ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మండలంలోని గ్రామంలో గల ఎమ్మార్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 17న మెగా జాబ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. జాబ్ మేళాలో 70కి పైగా కంపెనీల అధికారులు పాల్గొని నైపుణ్యత ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని, గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి కుటుంబాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ములుగు జిల్లా పరిపాలన యంత్రాంగం కలిసికట్టుగా నిర్వహించనున్నారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంజినీరింగ్, టెక్నికల్, ఫార్మసీ, స్కిల్డ్ వర్క్, సర్వీస్, పలు రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టనున్నారని తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులై ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ సమాన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం ములుగు డీఎస్పీ 8712670103, సీఐ 8712670111 సెల్ ఫోన్లో సంప్రదించాలని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొనేవారు పూర్తి సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.






