- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET UG 2026 పేపర్ మళ్లీ లీక్ అయ్యిందా..? PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇదే!
జూన్ 21న జరగనున్న ‘నీట్ యూజీ 2026’ (NEET UG 2026) రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని శనివారం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ 21న జరగనున్న ‘నీట్ యూజీ 2026’ (NEET UG 2026) రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని శనివారం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. బిబిన్ అనే ఎక్స్ (X) యూజర్ ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో వచ్చిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. నీట్ పేపర్ మళ్లీ లీక్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలో ‘కావేరి’ (KAVERI) అనే పేరుతో పాటు, కోడ్ ‘23’, ‘ఇంగ్లీష్’ అని ప్రింట్ చేసిన ప్రశ్నపత్రం కనిపించింది.
ఈ వాదనలపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. ఇదంతా పూర్తిగా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. విద్యార్థులు ఇలాంటి వదంతులను, ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించింది. పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక ‘నీట్’ (NEET) వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ప్రభుత్వంపై జరుగుతున్న ఇలాంటి అసత్య ప్రచారాలను తమ దృష్టికి తీసుకురావాలని కోరింది.






