- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేకరీ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి..
ఖమ్మం నగర నడిబొడ్డుని నరక కూపంగా మారుస్తున్నాడు ఓ బేకరీ నిర్వాహకుడు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం నగర నడిబొడ్డుని నరక కూపంగా మారుస్తున్నాడు ఓ బేకరీ నిర్వాహకుడు. అక్కడి ప్రజా ప్రాణాలను హరించే విష వాయువులను బహిరంగంగా గాల్లోకి వదులుతున్నాడు. దాంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారింది. జనవాసాల మధ్య విష వాయువులు వెదజల్లే ఫ్యాక్టరీలు ఉండకూడదనే ప్రభుత్వ నిబంధనను ఉల్లఘించడమే కాకుండా సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడే విధంగా బహిరంగంగా బేకరీ తయారి కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రశ్నించిన వారి పై దుర్భషలాడటం అతనికి అలవాటుగా మారింది. నిరంతరం పొగ వెదజల్లడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారింది. బేకరీ నిర్వాహకుడి నోటికి భయపడి స్థానిక ప్రజలు తలుపులు మూసుకుని ఉంటున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చినా నిర్వాహకుడు పట్టించుకోవటం లేదు.
పార్సిబంధాన్ని కమ్మేస్తున్న విష వాయువులు..
ఈ బేకరీ నిర్వాహకుడు నగరాన్ని నల్లటి పొగతో కప్పేస్తున్నాడు. కట్టెలు మండినప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు కట్టెలుకాల్చేటప్పుడు విలువడే కార్బన్ డై ఆక్సైడ్ పిండి పులియపెట్టే సమయంలో బేకింగ్ సమయంలో వచ్చే ఇథనాల్ గ్యాస్ తదితరాలను పీల్చిచే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు కలుగుతున్నాయి.
అస్వస్థతకు గురౌతున్న పిల్లలు, వృద్ధులు..
అందరికీ ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి లభిస్తే పార్సిబంధం ప్రజలకు మాత్రం విషవాయువులు పీల్చుకునే దుస్థితి నెలకొంది. దాంతో స్థానిక ప్రజల్లో అస్వస్థత నెలకొంది. చిన్న పిల్లలకు కంటి సమస్యలు, దగ్గు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. పార్సిబంధం ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో దిగువ ఉన్న ప్రజల ఇండ్లన్ని కలుషితం అవుతున్నాయి. దాని గురించి ఏ అధికారికి చెప్పిన పట్టించుకున్న నాథుడు లేడు. బేకరీ నుంచి విడుదలయ్యే పొగ వల్ల స్థానిక ప్రజల ఇండ్లు మసిబారి పోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ఇంట్లో ఫ్యాన్లు , గోడలు, కిచెన్ రూంల నిండ నల్లటి పొగ కమ్ముకుని ఉంటుంది. దాని కారణంగా తినే పదార్ధాలు కలుషితం అవుతున్నాయి. ఖమ్మం నగరంలోని గోపాలపురం సమీపంలోని సాగర్ కాల్వ పక్కన ఉన్న పవర్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని గతంలో మూసేశారు.
అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి..
ఇప్పుడు ఈ స్థాయిలో విష వాయువులు వెదజల్లుతుంటే అధికారులు సుందరమై నగరానికి మసిపూసే వారికి సహకారం అందిచడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బేకరీ నిర్వాహకుడి ఇంటికి ఆనుకొని ప్రముఖ ఛానల్‌లో పనిచేసే ఓ జర్నలిస్టు నాయకుడు నివాసం ఉంది. అతను అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న మున్సిపల్ అధికారులు జర్నలిస్టు ఇంటిని పరిశీలించారు. పొగ వల్ల గొడలు, ఫ్యాన్లు మసిబారడం నిజమే అని గుర్తించారు. దాంతో పాటుగా బయటి ఆవరణంలో పడుతున్న బూడిదను పరిశీలించారు. బేకరీ ద్వారా జరుగుతున్న నష్టాన్ని గ్రహించి వెంటనే క్లోజ్ చేయాలనే ఆదేశాలు జారీ చేసి నోటీసులు అందించారు. అయినప్పటికీ బేకరీ కొనసాగుతున్నది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






