- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులో భారీ ప్రమాదం.. సమయస్పూర్తితో బయటపడిన డ్రైవర్, ఉద్యోగులు
తిరుపతి జిల్లాలో శ్రీసిటీకి చెందిన ఉద్యోగులకు పెను ప్రమాదం తప్పింది. IMOP కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో శ్రీసిటీ(Sri City)కి చెందిన ఉద్యోగుల(Employees)కు పెను ప్రమాదం తప్పింది. IMOP కంపెనీ ఉద్యోగులు(IMOP company employees) ప్రయాణిస్తున్న బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే అప్రమత్తమైన ఉద్యోగులు, డ్రైవర్ బస్సు నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. దీంతో వారందిరికీ పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ రోజు లేచిన సమయం బాగుందని అనుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా తడ సమీపంలో జరిగింది. విధులు ముగించుకుని సూళ్లూరుపేట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో డ్రైవర్, ఉద్యోగులు ప్రాణాలను కాపాడుకోగలిగారని స్థానికులు అన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని అంచనా వేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో పోలీసులు సైతం ఊపిరిపీల్చుకున్నారు.






