- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bangladeshis : హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో గాజులరామారం హెచ్‌ఏఎల్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా, పాస్‌పోర్టు లాంటి ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు.
గుర్తించు-తొలగించు-బహిష్కరించు
ఇదిలా ఉండగా.. ‘గుర్తించు-తొలగించు-బహిష్కరించు’ అనే వ్యూహాంతో ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అనుమానిత చొరబాటుదారులను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరించడంతో పాటు, 23 జిల్లాల్లో ప్రత్యేక ‘నిర్బంధ కేంద్రాలను’ ఏర్పాటు చేశారు. గతంలో ఆగిపోయిన ఈ బహిష్కరణ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేశారు. అలాగే.. ప్రభుత్వ కఠిన చర్యలతో వందలాది మంది అక్రమ బంగ్లాదేశీయులు బితారి-హకింపూర్ సరిహద్దుల ద్వారా స్వదేశానికి వెళ్లేందుకు బారులు తీరుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముమ్మరంగా సాగుతున్న ఈ తరలింపు ప్రక్రియ ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తుండటం గమనార్హం.






