- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి కూలీలకు రూ.500 వేతనం ఇవ్వాలి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే
ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.500 వేతనం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, ములకలపల్లి: ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.500 వేతనం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పాతూరు, గుర్రాలగుంట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన పనుల నిర్వహణ, వేతనాల చెల్లింపులు, పని దినాలపై ఆరా తీశారు. ఎండాకాలంలో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పని ప్రదేశాల్లో మెడికల్ కిట్‌లు, టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు సరిపడా పని దినాలు, తగిన వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతుల ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా ధర్మ, మాజీ సర్పంచ్ బైటి రాజేష్, పెద్దరాపు నాగరాజు, తాటి రవి, సోయం చిన్నారి, ఊకే అశోక్, సోడే శ్రీనివాస్, బొర్రా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






