- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌లో చేరిన ప్రముఖ న్యాయవాది..
ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద నగేష్ BRS పార్టీలో చేరారు.

దిశ, నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణంలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, నల్గొండ అభివృద్ధి ప్రదాత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మంద నగేష్ BRS పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంద నగేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి యువత ముందుకు రావాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లగొండ జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భూపాల్ రెడ్డి తదితరులున్నారు.






