- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో జీఐఐఎస్ స్కూల్.. సీఆర్డీఏతో కీలక ఒప్పందం
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయి. రాజధాని అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ కేంద్రం అండగా నిలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయి. రాజధాని(Capital) అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ కేంద్రం అండగా నిలుస్తోంది. కేంద్రం ఇస్తున్న నిధులను అందిపుచ్చుకుని రాజధానిని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. దీంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. హోటల్, విద్యా రంగంలోనూ పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంట్రీ
తాజాగా అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు సీఆర్‌డీఏతో జీఐఐఎస్ స్కూల్ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో సీఆర్‌డీఏ జేడీ జుబిన్‌రాయ్‌ను జీఐఐఎస్ కంట్రీ డైరెక్టర్ రాజీవ్‌కౌల్ కలిశారు. స్కూలు ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలపై ఇరువురుసంతకాలు చేసుకున్నారు. త్వరలోనే స్కూలు ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని రాజీవ్‌కౌల్ పేర్కొన్నారు. పేరున్న విద్యాసంస్థలు ఎన్ని వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని సీఆర్‌డీఏ జేడీ జుబిన్‌రాయ్ పేర్కొన్నారు.






