- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుద్ద్యానికి, పచ్చదనానికి పెద్దపీట
పారిశుద్ద్యానికి, పచ్చదనానికి ఎంఎంసీ పెద్దపీట వేస్తుందని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : పారిశుద్ద్యానికి, పచ్చదనానికి ఎంఎంసీ పెద్దపీట వేస్తుందని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ ప్రాంతాన్ని అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ పర్యటించి పారిశుధ్యం, అర్బన్ బయోడైవర్సిటీ, దోమల నివారణ కార్యకలాపాలు, వర్షాకాల సన్నద్ధత చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందు అరణ్య నుంచి గోల్డెన్ లీవ్స్ విల్లాస్ వరకు పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించిన కమిషనర్ పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఫుట్‌పాత్‌ల వెంట మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యూబీడీ మేనేజర్‌కు సూచించారు.
ఫతుల్లాగూడ చెరువును పరిశీలించిన కమిషనర్ చెరువులో దోమల లార్వా పెరుగుదల లేదని గుర్తించారు. చెరువు సమీపంలోని బాక్స్ డ్రెయిన్లలో లార్వా ఉన్నట్టు గుర్తించి, వెంటనే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేపట్టి దోమల ఉత్పత్తిని పూర్తిగా నివారించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతలో భాగంగా ఆదర్శ్ నగర్, అగర్వాల్ గ్రానైట్, జైపురి కాలనీ ఎక్స్ రోడ్, శ్రావణ శ్రీ ఎన్‌క్లేవ్, ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్, అగమయ్య కాలనీ, గణేష్ నగర్, పుల్లారెడ్డి స్వీట్స్, పెద్ద అంబర్‌పేట్ చెక్‌పోస్ట్, భూదాన్ కాలనీ, కళానగర్, హనుమాన్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని, నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.






