పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యం.. ప్రజలు ముందుకు రావాలి : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

ప్రజా - పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఆర్సిపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యం.. ప్రజలు ముందుకు రావాలి : ఎమ్మెల్యే
X

దిశ, టేకులపల్లి : ప్రజా - పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఆర్సిపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ అనేది పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలను ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాటించాలన్నారు. “చెత్తను సక్రమంగా నిర్వహిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే భావనతో అందరూ ముందుకు రావాలన్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోడు ఎస్ఐ (సబ్ ఇన్స్పెక్టర్) శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే రోడ్డు భద్రత నియమాల పై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని తెలిపారు. మనం నియమాలను పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించగలం, సురక్షిత సమాజాన్ని నిర్మించగలమణి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరై వారి శాఖల పై పూర్తి వివరాలను ప్రజలకు ఈ వేదికగా తెలియజేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులకి పెద్దపీట వేస్తుందని, అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం అమలు చేస్తూ, ముక్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ వేదికగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్ , సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story