తక్కువ ధరలో Oppo నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

by  |
oppo
X

దిశ, వెబ్‌డెస్క్: Oppo నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. Oppo A11s ఫోన్‌ చైనాలో విడుదల అయింది. కొత్త ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 SoC తో పనిచేస్తుంది. Oppo A11s Android 10 పై ColorOS 7.2తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో 2MPడెప్త్ సెన్సార్, 2MPమాక్రో కెమెరా, 13MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. బేస్ స్టోరేజ్ 4GB + 64GB వేరియంట్ ధర రూ.11,800. ఇంకొక వేరియంట్ 8GB + 128GB ధర రూ.14,100. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనా, Oppo ఆన్‌లైన్ స్టోర్‌లలో లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000mAh, ఇది 18w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఫోన్ ద్వారా గుండె, శ్వాసకోశ రేటు తెలుసుకోండిలా..!

డిసెంబర్ చలిలో.. అందాలను గాలికొదిలేసిన సింగర్



Next Story

Most Viewed