ఫోన్ ద్వారా గుండె, శ్వాసకోశ రేటు తెలుసుకోండిలా..!

by  |
google
X

దిశ, వెబ్‌డెస్క్: Google Fit యాప్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఫిట్‌నెస్ ట్రాకింగ్ అప్లికేషన్‌లలో ఒకటి. ప్రజలకు వ్యాయామ సంబంధిత అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తోంది. ఇది ఎప్పటికప్పుడు అప్‌‌‌‌‌‌‌‌‌‌డేట్ అవుతూ వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు Google పిక్సెల్ డివైజ్‌ని ఉపయోగించి వినియోగదారులు హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటును ట్రాక్ చేయడానికి ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ios డివైజెస్‌ కోసం Google Fit ఈ ఫీచర్‌ని iphoneలకు తీసుకువస్తోంది. మొబైల్ కెమెరాని ఉపయోగించి హార్ట్, రెస్పిరేటరీ డేటాను పొందవచ్చు.

iOS వినియోగదారులు Google Fit యాప్ ద్వారా వారి హృదయ స్పందన రేటును ట్రాక్ చేయడానికి iPhone కెమెరా సెన్సార్‌పై వేలిని ఉంచాలి. తేలికపాటి ఒత్తిడిని వర్తింపజేయాలి. తర్వాత హృదయ స్పందన రేటును పొందవచ్చు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లాష్‌ను ఆన్ చేయాలి. ఫ్లాష్ ఆన్ చేయడం వల్ల కచ్చితత్వం పెరుగుతుంది. ఈ ఫీచర్ పని చేయడానికి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. మీరు వెనుక కెమెరాపై మీ వేలిని ఉంచినప్పుడు మీ హృదయ స్పందన రేటును కొలవడానికి యాప్‌కి దాదాపు 30 సెకన్ల సమయం పడుతుంది.

google fit

మీరు 30 సెకన్ల తర్వాత మీ వేలిని తీసివేస్తే, యాప్‌లో ప్రివ్యూ గ్రాఫ్, BPMని చూస్తారు. ఈ టెస్టింగ్ పూర్తయిన తర్వాత గూగుల్​ ఫిట్‌లో మీ హెల్త్​ మానిటరింగ్​హిస్టరీని సేవ్ చేయాలా వద్దా అని ఎంచుకోవచ్చు. శ్వాస క్రియ రేటును ట్రాక్ చేయడానికి యాప్ డిస్‌ప్లేలో మీ తల పైభాగం కనిపించేలా మీరు మీ ఫోన్‌ను స్థిరంగా ఉంచాలి. అప్పుడే కచ్చితత్వంతో కూడిన ఫలితం వస్తుంది. యాప్ తదుపరి అనుసరించాల్సిన దశల గురించి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఉండే సూక్ష్మ చాతీ కదలికల నుంచి యాప్ మీ శ్వాస రేటును గుర్తిస్తుంది. దీని ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించిన డేటా పొందవచ్చు. త్వరలో ఈ ఫీచర్‌ను మరిన్ని ఫోన్‌లకు విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది.

Read more: తక్కువ ధరలో Oppo నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

వాట్సాప్‌లో గూగుల్ మ్యాప్ తరహా ఫీచర్..!


Next Story

Most Viewed