- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్ టైట్ డ్రెస్‌లో గ్లామర్ షో.. ఆకట్టుకుంటున్న పాపం ప్రతాప్ బ్యూటీ
గ్రీన్ అవుట్‌ఫిట్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న పాయల్ రాధాకృష్ణ.

దిశ, వెబ్ డెస్క్: పాయల్ రాధాకృష్ణ మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె 2021లో విడుదలైన ‘సింగపెన్నె’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అదే ఏడాది ‘తరగతి గది ధాటి’ అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
అనంతరం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ నటి ‘పాపం ప్రతాప్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మూవీ ద్వారా పాయల్‌కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపిస్తూ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో పాయల్ మెడలో చిన్న చైన్, చెవులకు చిన్న ఇయర్ రింగ్స్ ధరించి, చేతికి స్టైలిష్ బ్రాస్‌లెట్ వేసుకుంది.
అలాగే వెంట్రుకలను అందంగా సెట్ చేసుకొని క్యూట్ స్మైల్‌తో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. మొత్తంగా ఈ ఫోటోల్లో ఆమె క్యూట్ లుక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుండగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






