క్షేత్రస్థాయి పునాదిపై ఫోకస్.. పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగు

by Vemula.Srinu Prasad |

జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకే ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.....

క్షేత్రస్థాయి పునాదిపై ఫోకస్.. పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన(Janasena)ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకే ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు వారిని బాధ్యతలు కూడా కల్పించే దిశగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమించారు.

జనసైనికుల నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం

జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి ఈ కమిటీలు పవన్ కల్యాణ్ పరిశీలనకు ఇవ్వనున్నాయి.

28 మంది సభ్యులతో కమిటీ

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ రూపుదిద్దుకుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించనున్నారు.

స్వయంగా తుది నిర్ణయం

ఇక పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ కమిటీల కూర్పును స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోనున్నారు.

వినూత్న ప్రక్రియకు శ్రీకారం

క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి జనసైనికుడికి గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో, దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

Next Story